రానున్నది రాజన్న రాజ్యమే

– నవరత్నాల పథకాలతో ప్రజలకు లబ్ధి
– వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి

సుండుపల్లి: రాజన్నకు గుర్తుగా జగనన్నకు తోడుగా వైయస్సార్‌ కుటుంబంతో పల్లెజనం మమేకమవుతుంది. వైయస్ఆర్ కుటుంబానికి ఎక్కడ చూసినా విశేషమైన ఆదరణ లభిస్తోంది. వారికష్టాలు  చెపుతూ కన్నీరు పెడుతున్నారు. అన్నిసమస్యల పరిష్కారం రాజన్న రాజ్యంలోనే సాధ్యమతాయని అంటూ వైయస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాద్‌రెడ్డి పేర్కొన్నరు. మంగళవారం సుండుపల్లి మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామపంచాయితీ కటారుముడుకులో వైయస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ పాలనలో ఎదురైన కష్టాలను ప్రజలు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఒక్కహామీ నెరవేర్చలేదని అన్నారు. రుణమాఫీ, నిరుద్యోగబృతి, ఇంటికో ఉద్యోగం అంటూ జనాన్ని నమ్మించి మోసంచేశారని మండిపడ్డారు. మోసకారి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో అర్హులందరికీ పక్కాగృహాలు, జన్మభూమి కమిటీలతో  సంబంధంలేకుండా పింఛన్లు, రుణాలు, నవరత్నాలు పథకాల గురించి వందశాతం లబ్దిచేకూరుతుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి వైయస్సార్‌కుటుంబం మిస్స్‌డ్‌కాల్‌ కార్యక్రమం చేపట్టారు.  తమకు ఇంతవరకు ఇళ్లు, రుణం ఇవ్వలేదని, చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తమ  భాధలను ఆకేపాటి దృష్టికి తీసుకువచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యమని,  ఆయా గ్రామ పంచాయితీల్లో ఇప్పుడు తెలిపిన సమస్యలన్నీ మిస్స్‌డ్‌కాల్‌ కార్యక్రమంలో నమోదవుతున్నాయని , మొదటి ప్రాధాన్యతగా ఆ సమస్యలను గ్రామపంచాయితీలో అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అజంతమ్మ, వైయస్సార్‌సీపీ జిల్లాసంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, ఎంపీటీసీ బాబురెడ్డి, ఎస్సీనాయకులు చంద్రానాయక్, నరసింహులునాయక్, సీనియర్‌నాయకులు రాజారెడ్డి, ఆంజనేయులు, విద్యార్థిసంఘ నాయకులు అబ్దుల్లా, అభిషేక్, గిరిజన రైతునాయకుడు సుబ్బరామనాయక్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top