మోసపోయిన ప్రజలే బాబుకు బుద్ధి చెబుతారు

అనంతపురం:

వందల హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి అన్నారు. నియోజకవర్గ పరిధిలో తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు మోసాలను వివరించారు. అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

Back to Top