ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోచుకుతింటున్నారు

తూ.గో. జిల్లా(పి. గన్నవరం))రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైయస్సార్సీపీ పి. గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టి బాబు మండిపడ్డారు. తూ.గో.జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, నాగుల్లంక  గ్రామంలో గడపగడపకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్కా ఇళ్లు, పెన్షన్లు, రోడ్లు, ఇండ్లస్థలాలు ఏవీ ఇవ్వడం లేదని ప్రజలు ప్రభుత్వ అసమర్థతను చిట్టిబాబు దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి అందినకాడికి దోచుకుంటున్నారని చిట్టిబాబు ధ్వజమెత్తారు. బాబు పాలనతో విసిగుచెందిన ప్రజలు వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.


Back to Top