ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు

ప్రకాశంః గిద్దలూరు నియోజకవర్గం  బేస్తావారి పేట మండలం కోన పల్లి పంచాయతీ సింగసాని పల్లి గ్రామం లో  నియోజకవర్గ ఇంచార్జ్ ఐ.వి.రెడ్డి ఆధ్వర్యంలో, కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని రామయపట్నంలో తూమాటి మాధవ రావు ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా వారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపలో ఎండగట్టారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన మరణానంతరం సక్రమంగా అమలు జరగడం లేదని, ప్రస్తుత తెలుగుదేశ  ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చే  విషయంలో కేంద్రప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని  ఆరోపించారు.. ప్రత్యేక హోదా పోరాటంలో యువత  ముందుండాలని పిలుపునిచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top