అన్నీ కష్టాలే

తూర్పుగోదావరి(జగ్గంపేట))పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగినా ఇవ్వడం లేదు. కొన్నేళ్లుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాం. అయినా ఇంతవరకు అతీగతీ లేదు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాం. రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.  తమను పట్టించుకునే వారే కరువయ్యారంటూ గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామస్తులు వాపోయారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబు మోసపూరిత పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాల శ్రీనివాస్ సమక్షంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. 


Back to Top