పోటెత్తిన పల్నాడు

గడప గడపకూ వైయస్‌ఆర్‌’కు అనూహ్య స్పందన
గుంటూరు:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం పిడుగురాళ్లలో ఈ నెల 15వ తేది నుంచి ప్రారంభమైంది. వైయస్‌ఆర్‌సీపీ గురజాల నియోజకవర్గం సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడప కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడంతో ఆధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన మెదలైంది. టీడీపీ నాయకుల అంచనాలకు మించి కార్యక్రమానికి ప్రజలు హజరుకావడంతో కలవారపాటుకు గురైయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విదంగా గురజాల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అక్రమ కేసులు బనాయింపు వంటి వాటిని ఇక నుండి బెదిరేదిలేదని ప్రతి ఒక్కరు జగన్‌ వెంటే నడుస్తామని ముందుకు వస్తున్నారు.సాయంత్రం 4 గంటలకు వైయస్‌ఆర్‌సీపీ  గడపగడప కార్యక్రమం ప్రారంభం జరుగుతుందనగా మూడు గంటల నుండే పిడుగురాళ్ల జనసంద్రంగా మారింది. పల్నాడు ప్రాంతం ఒక్కసారిగా పోటెత్తింది. అధికార దాహంతో ఎమ్మెల్యే , ఎంపీలు, జడ్‌పీటీసీలు, ఎంపీపీలను బెదిరించి టీడీపీలోకి అహ్వనించినా మేము  జగన వెంటే ఉంటామని తెలియచేశారు. 

స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం
వైయస్సార్‌సీపీలోకి కాసు మహేష్‌రెడ్డి చేరిన నాటినుండి గురజాల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో, నాయకుల్లో నూతనోత్సహాం వచ్చింది. గడపగడప కార్యక్రమంను విజయవంతం చేయాలని చేపట్టిన కార్యకర్తల సమావేశాల్లో మీ వెంటే నేనుంటానని  కాసు మహేష్‌రెడ్డి భరోసా కల్పించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అన్యాయయాలను ప్రశ్నించే వారిపై చేస్తున్న అక్రమకేసుల గురించి భయపడేది లేదని భయపడాల్సిన పరిస్దితులు ఇక రావని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా వుండి  మీ సమస్య నా సమస్యగా చూసుకుంటానని సమావేశంలో హామీఇచ్చారు. దీనికి తోడు టీడీపీ నాయకులు దురాగతాలు, అక్రమాలపై విసుగుచెందిన ప్రజలు కాసు మహేష్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్వచ్చందంగా తరలివచ్చారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవెర్చకుండా కేవలం మాటలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రభుత్వానికి త్వరలో బుద్దిచెప్పేందుకు సన్నదమైనట్లు సమాచారం.టీyî పీ పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో పిడుగురాళ్లలో జరిగిన గడపగడపకు హజరైన ప్రజలను చూస్తే ఇట్టే అర్దమవుతుంది.

కదిలొచ్చిన గ్రామాలు..
పిడుగురాళ్ల పట్టణంలో ప్రారంభమైన గడపగడప కార్యక్రమానికి గ్రామాలే కదిలొచ్చినట్లుగా వుందని పలువురు ఆభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయాంలో ఆధికారులు గ్రూపులుగా విడిపోయి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా అని సంక్షేమ పధకాలకు అర్హులైతే వెంటనే వారి వద్దనుండి ధరఖాస్తు స్వీకరించి పధకం ఫలాలు అందేవిదంగా చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం అధికార పార్టీ కేవలం జన్మభూమి కమిటీ సభ్యులు ఓకే చేస్తేనే వారికి సంక్షేమ పధకాలు, చివరికి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆసరగా ఉంటుందని పింఛన్‌ మంజూరుతో సహా రాజకీయ రంగు పులుమారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి అన్నింటికి రాజకీయ రంగు పులమడంతో గ్రామాల్లోని ప్రజలు విసుగుచెందారు. 

ఆలోచనలో పడిన ఆధికార పార్టీ నాయకులు 
కాసు మహేష్‌రెడ్డి తాత మాజీ ముఖ్యమంత్రి, పెద్ద నాన్న,నాన్న మంత్రులుగా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించారు. కాసు కుటుంబానికి పల్నాడు ప్రాంతంలోని ప్రజలకు దగ్గర సత్సంబందాలు ఉన్నాయి.దీనికి తోడు టీడీపీ చేస్తున్న అరాచకాలు వెరసి గడపగడప కార్యక్రమం విజయవంతం అయింది. సుమారుగా 6వేల నుండి 8 వేల వరకు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.ఎన్నికల సభను తలపించేవిదంగా ప్రజలు రావడంతో అధికార పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు.నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ పని అయిపోయిందంటున్న సమయంలో ఉప్పెనలా ప్రజల ఆదరణ రావడంతో ఆధికార పార్టీ నాయకులు నివ్వెరపోయారు.    



Back to Top