పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం

శ్రీకాకుళం(నరసన్నపేట))అన్ని అర్హతలున్నా ప్రభుత్వం అన్యాయంగా సామాజిక పింఛన్లను తొలగించిందని ఊడికలపాడు గ్రామానికి చెందిన బాధితులు వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దరివాడ, ఊడికలపాడు గ్రామాల్లో ధర్మాన గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. మహానేత వైయస్ఆర్ హయాంలో నెల నెల పింఛన్ వచ్చేదని...బాబు వచ్చాక వృద్ధులు, వికలాంగులు అని తేడా లేకుండా ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోయారు.

సీసీరోడ్లు, పక్కా ఇళ్లు ఏవీ లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు.తమతో ఓట్లు వేయించుకొని టీడీపీ నాయకులు తమ గ్రామాలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడ్డారు. గడపగడపలో ప్రజలు వైయస్సార్సీపీకి ఎనలేని ఆదరణ చూపిస్తున్నారని కృష్ణ దాస్ అన్నారు. కొంచెం ఓపిక పడితే మనకు మంచి రోజులు వస్తాయని...వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. 


Back to Top