చంద్ర‌బాబును న‌మ్మి మోస‌పోయాం

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ లో ప్రజల ఆవేదన
హామీలు విస్మరించిన బాబుపై మండిపాటు

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులు ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ మోసాలను ఎండగడుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా ఒకటే ఆవేదన.  చ‌ంద్ర‌బాబుకి ఓటు వేస్తే న్యాయం జ‌రుగుతుంద‌నుకున్నాం...కానీ, ఇలా మోసం చేస్తారనుకోలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
వైయ‌స్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు కొలుసు పార్థ‌సారథి  పెనమలూరు నియోజకవర్గం గంగూరులో గడపగడపలో పర్యటించారు. బ్యాంకుల్లో త‌మ అప్పులు  తీర‌లేదు. పొదుపు చేయ‌టం క‌ష్టంగా ఉంద‌ని ఈసందర్భంగా మహిళలు త‌మ గోడును వెళ్లబోసుకున్నారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెంచారు.. పిల్ల‌ల‌కు ఉద్యోగాలు లేవు... రైతు రుణామాఫీ లేదు.. కాలువ క‌ట్ట‌ల‌పై ఉంటున్న త‌మ‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ప‌లువురు మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే  మీ కష్టాలన్నీ తీరిపోతాయని పార్థసారథి వారిలో ధైర్యం నింపారు.


శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళావతి గడపగడపలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  ప్రతీ గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని  స్వయంగా డైరీలో రాసుకుంటున్నారు. మరోవైపు, పాతపట్నం నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి గడపగడపకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. బాబు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక మీ సమస్యలన్నీ తీరిపోతాయని వారిలో భరోసా కల్పిస్తున్నారు. 


విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ విజయప్రసాద్,  చోడవరం కన్వీనర్ కరణం ధర్మశ్రీ,  బుచ్చయపేట మండలంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి బాబు అవినీతి, అరాచక, మోసపూరిత పాలనను ఎండగడుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ప్రజలు వైయస్సార్సీపీ నేతల వద్ద మొరపెట్టుకుంటున్నారు. Back to Top