బాబును తిట్టిపోస్తున్న ప్రజలు

మంగ‌ళ‌హార‌తుల‌తో స్వాగ‌తం
శ్రీ‌శైలం:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మకంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మానికి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. మ‌హిళ‌లు మంగ‌ళ‌హ‌ర‌తుల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి బండిఆత్మ‌కూరు మండ‌లం లింగాపురంలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోసపూరిత హామీల‌ను వివ‌రించారు. అనంత‌రం వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. ఈసందర్భంగా ప్రజలు చంద్రబాబును తిట్టిపోశారు. 

స‌మ‌స్య‌ల‌పై స‌ర్కారు నిర్ల‌క్ష్యం
క‌ల్లూరు(పాణ్యం):  ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతుంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి ఆరోపించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక 32వ వార్డు పంచాయ‌తీ కార్యాల‌యంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చ‌రితారెడ్డి మాట్లాడుతూ.... జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యుల ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా ఎంతో మంది అర్హ‌త‌లున్నా ప‌థ‌కాల‌కు దూర‌మ‌వుతున్నార‌న్నారు. 

అన్నీ ఉత్తుత్తి హామీలే
తుగ్గ‌లి(ప‌త్తికొండ‌): ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల మేర‌కు మాకు ఏవీ అంద‌డం లేద‌ని రైతులు, నిరుపేద‌లు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, వృద్ధులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా తుగ్గ‌లిలో పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు నాగేష ఆధ్వ‌ర్యంలో చెరుకుపాడు నారాయ‌ణ‌రెడ్డి పర్యటించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ... గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేస్తున్న మండ‌ల నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Back to Top