నవరత్నాలతోనే రాష్ట్ర పురోగతి సాధ్యం

  • పేదల అభివృద్ధే నవరత్నాల లక్ష్యం
  • జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి
కరకుదురు(పెదపూడి): వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాలు పథకాలతో రాష్ట్ర పురోగతి సాధ్యం అవుతుందని జిల్లా అధికారప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి తెలిపారు. కరకుదురు గ్రామంలో వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాలు కార్యక్రమం 211 బూత్‌ పరిధిలో బూత్‌ కన్వీనర్‌ కనికెళ్ల సురేష్, ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాల సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ... పేదల అభివృద్ధే లక్ష్యంగా నవరత్నాల పథకం రూపొందించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా బూత్‌ల పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు టీడీపీ వైఫల్యాలను వివరించారు. అనంతరం నవరత్నాల కరపత్రాలను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, మండల కన్వీనర్‌ గాజంగి వెంకటరమణ, పెదపూడి, బిక్కవోలు మండలాల అధికార ప్రతినిధులు వాసంశెట్టి మాధవ, మానుకొండ సాగర్‌రెడ్డి, మండల కార్యదర్శులు ఏలేటి రాజు, వుండ్రు దొరబాబు, గ్రామ కన్వీనర్‌ అడపా బాబురావు, పార్టీ నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు సానా రాంబాబు, పార్టీ నాయకులు వల్లూరి పట్టాభి, వాసంశెట్టి సత్తిబాబు, అంబటి సతీష్, పాటంశెట్టి త్రిమూర్తులు, యండ్రు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలతో పేదల కుటుంబాల్లో వెలుగులు
కుందూరు (కె.గంగవరం): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని కుందూరు సర్పంచ్ విజయకుమారి, మండల ఎస్సీ సెల్‌, బీసీ సెల్ నాయకులు బత్తుల అప్పారావు, పంపన సుబ్బారావు పేర్కొన్నారు. వారి ఆధ్వర్యంలో గురువారం కుందూరు గ్రామంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. వారితోపాటు బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి వైయస్సార్‌ కుటుంబంలో చేరాలని కోరారు. పామర్తి బాబి, పర్వతనేని రామకృష్ణ, పెట్టా జానకిరామయ్య, కట్టా అబ్బులు, పల్లా విష్ణుమూర్తి, చిట్టూరి శ్రీనివాస్, సుంకర సత్యనారాయణ, పంపన సత్తిబాబు, అనుసూరి నాగేశ్వరరావు, కట్టా నాగేశ్వరరావు, వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, పోలిశెట్టి అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top