స‌మ‌స్య‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి

జ‌గ్గంపేటః చంద్ర‌బాబు పాల‌న‌లో ఏ గ్రామంలో చూసినా స‌మ‌స్య‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జ్ ముత్యాల శ్రీనివాస్ అన్నారు. జ‌గ్గంపేట మండ‌లం రామ‌వ‌రం గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తిరుగుతూ చంద్ర‌బాబు హామీల అమ‌లుపై ఆరా తీశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సంక్షేమ ప‌థ‌కాలను గాలికొదిలేసి విదేశాల తిరుగుతూ చంద్ర‌బాబు సొంత డ‌బ్బా కొట్టుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. గ్రామంలో అర్హులైన వారికి ఆస‌రా ఫించ‌న్లు అందించ‌కుండా వివ‌క్ష చూపుతున్నార‌న్నారు. రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. 


Back to Top