సాగునీరు లేక ఇబ్బందులు

గుంటూరు(రేపల్లె

))పంటకాల్వలకు సాగునీరు అందకపోవడంతో ఎండుదశకు చేరాయని రైతులు వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ వద్ద వాపోయారు. రైతులు, డ్వాక్రారుణాలు మాఫీ చేస్తానని చెప్పి బాబు మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన చెరుకుపల్లి మండలంలో పర్యటించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వానికి ఇవేమీ పట్టకపోవడం దారుణమన్నారు. టీడీపీ మోసాలపై ప్రజాబ్యాలెట్ ద్వారా ఎండగట్టారు. బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top