ఇంటింటికీ ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం చురుగ్గా సాగుతోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తుండ‌గా స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికి, త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇంటింటా ప‌ర్య‌టించి పార్టీ రూపొందించిన ప్ర‌జాబ్యాలెట్‌ను పంపిణీ చేసి చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. అలాగే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌డుతున్న పోరాటాల‌ను వివ‌రిస్తున్నారు. 
* క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని సున్నిపెంట మండ‌లం లింగాల‌గ‌ట్టు గ్రామంలో పార్టీ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి ప‌ర్య‌టించారు. 
* ప్ర‌కాశం జిల్లా గూడ్లురు మండలంలోని పాజర్ల‌ పంచాయ‌తీలో కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌కర్త‌ తూమాటి మాధవరావు  గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.ఈ కార్యక్రమం లో గూడ్లురు జెట్పిటిసీ వెంకట్ రామిరెడ్డి  , కందుకూరు రూరల్ యూత్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు , గూడ్లురు కన్వీనర్ శ్రీ కృష్ణ  , యూత్ కన్వీనర్ శ్రీ కిశోర్  , బి.సి సెల్ కన్వీనర్ శ్రీ నరసింహ , మాల్యాద్రి , పుల్లయ్య, నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* ప్ర‌కాశం జిల్లా కొండేపి నియోజ‌క‌వ‌ర్గం టంగుటూరు ప‌ట్ట‌ణం బాపుజీ కాల‌నీలో పార్టీ  ఇన్‌చార్జ్ వ‌రికూటి అశోక్‌బాబు ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.
* శ్రీ‌కాకుళం జిల్లా మెలిపుట్టి మండ‌లం మెర‌డికోట పంచాయ‌తీలో పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మోసాల‌ను ఆమె వివ‌రించారు.
* అనంత‌పురం  జిల్లా రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.


తాజా ఫోటోలు

Back to Top