ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ

తూర్పుగోదావ‌రి: రాజోలు నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో శనివారం గడప గడపకు వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఇంటింటికి ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల వరకు జరిగింది.  

Back to Top