అండగా నిలవండి

తూర్పుగోదావరిః చంద్రబాబు పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని వైయస్సార్సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అన్నారు. గోకవరంలో ఆయన గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, వీధిరోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను స్థానికులు ముత్యాల శ్రీనివాస్ కు ఏకరవు పెట్టారు. ఇళ్లు మంజూరు కావడం లేదని కాలనీ సంజీవయ్యనగర్ కాలనీవాసులు వాపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ...అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను వంచించాడని మండిపడ్డారు. ప్రజల కష్టాలు తీరాలన్నా, రాజన్న రాజ్యం తిరిగి పొందాలన్న అది వైయస్ జగన్ తోనే సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్సీపీకి సహకరించి అండగా నిలవాలని ప్రజలను కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top