నవరత్నాలతో పేదరికం దూరం

•9న జరగనున్న సభని విజయవంతం చేయండి
• నియోజకవర్గ సమన్వయకర్తః రెడ్డిశాంతి

హిరమండలంః వైయస్సార్‌సీపీ అధ్యక్షులు వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే పేదరికం దూరమవుతుందని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు,పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డిశాంతి అన్నారు. ఈనెల 9న పాతపట్నంలో నవరత్నాలపై నిర్వహించనున్న సభపై హిరమండలం సుభలయ మెట్టతోటలో మండలంలోని మండల ముఖ్యనాయకులు, భూత్‌ కమిటి సభ్యులతో సమావేశంను బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అధికార టిడిపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు,ఆర్ధిక పరమైన ఇబ్బందులుతొలగించడం కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది పథకాలు ప్రకటించారని అన్నారు.ఈ పథకాల ద్వారా పేదలు,మహిళలు,రైతులు,విద్యార్ధులుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. వైయస్సార్‌సిపి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు ఖచ్చితంగా అమలవుతాయన్నారు. ఈపథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసకువెళ్లాలన్నలక్ష్యంతో ఈనెల 9న పాతపట్నంలో నవరత్నాల సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసభకు ప్రజలు అధిక సంఖ్యలో హజరయ్యేలా కార్యకర్తలు కషిచేయాలన్నారు.పథకం ప్రయోజనాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లే భాధ్యత గ్రామ స్థాయి నాయకులదేనని అన్నారు.సభను ప్రతీఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిరు. ఈకార్యక్రమంలో వైసిపి రాష్ట్రయువజన ప్రదాన కార్యదర్శి అల్లు కష్ణారావు, మండల పార్టీ కన్వీనర్‌ ఏ.శంకర్‌రావు,వెలమలబాలరాజు,రవివర్మ,దివాకర్,నరేష్,ఇంద్రకుమార్‌తో పాటు అన్నిగ్రామలా బూత్‌కమిటీ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

Back to Top