గడపగడపకూ ప్రజల పార్టీ

చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
హామీలను విస్మరించిన టీడీపీపై ఆగ్రహం
బాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు
వైయస్ జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వాసం
ప్రతీ గడపలో ఒకే మాట ఒకే నినాదం వైయస్ జగన్

ఏపీః గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. వైయస్సార్సీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. బాబు మోసాలను, అవినీతి, అరాచకాలను తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను అందించి వారి నుంచి వివరాలు తీసుకుంటున్నారు. అందరి నోటు ఒకే మాట వినిపిస్తోంది. మాయమాటలతో నమ్మించి ఓట్లువేయించుకొని మోసం చేసిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలంతా చెబుతున్నారు. 

బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
ఒంగోలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఒంగోలులో గడప గడపకూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, చంద్రబాబుకు ఓట్లేసి తప్పుచేశామని ప్రజలు గగ్గొలు పెడుతున్నారన్నారు. ఏ వీధికి వెళ్లినా చంద్రబాబు వ్యతిరేక విధానాలపై మాట్లాడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమైందని, ఖచ్చితంగా ప్రతి గడపకు వెళ్లి చంద్రబాబు అవినీతి పరిపాలనను వివరిస్తామని స్పష్టం చేశారు. 


ఓట్లేసి తప్పుచేశామని ప్రజల పశ్చాతాపం
వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేసి తప్పుచేశామని ప్రజలే పశ్చాతాప పడుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు పాలన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పులు నూరు కాదు వేల సంఖ్యలో ఉన్నాయని ప్రజలే తమ దృష్టికి తీసుకువస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పారు. ఏ గ్రామంలో చూసినా పెన్షన్ల సమస్యే అధికంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలకు నమ్మి మోసపోయిన ప్రతి ఇళ్లు ఒక విషాదగాధలో చీకటిలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాగ్ధానాలన్నీ నెరవేర్చానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఎప్పుడు బుద్ధి చెబుదామా అని ప్రజలంతా కాచుకొని కూర్చున్నారని చెప్పారు. 

బాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోలగట్ల
విజయనగరం: చంద్రబాబు పరిపాలనతో విసిగిపోయిన ప్రజలంతా రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గడప గడపకూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమాన్ని శనివారం నగరంలోని  15, 16 వార్డుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు చేస్తున్న అవినీతి, అక్రమాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ కోలగట్ల మాట్లాడుతూ బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల తరుపున పోరాడుతున్నారని స్పష్టం చేశారు. భవిషత్తులో ఏ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయకుండా ఈ భృబృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని ప్రజలంతా ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. గడప గడపకూ వైయస్‌ఆర్‌ సీపీని రెండు రోజులుగా విజయవంతం చేస్తున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 
నెల్లూరు రూరల్‌: ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించే విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.  నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్‌లో ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలని అధికారులకు అదేశించారు. అనంతరం లారీ ప్రమాదంలో గాయపడి జీవనాధారం కోల్పోయిన డ్రైవర్‌ వంశీ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. వంశీ భార్యకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్‌ అందించారు. వంశీ ఆరోగ్యంపై స్పష్టత కోసం ఆసుపత్రి నుంచి డాక్టర్‌లను పిలిపించి వైద్య సేవలు చేయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్‌ వంశీకి మెరుగైన వైద్య సేవలను అందించి మళ్లీ మామూలు మనిషిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నేతలు కూకాటి ప్రసాద్, హరి, కమల్‌రాజ్, మురళీ, వంశీ, విజయరామిరెడ్డి, కృష్ణ, జనార్ధన్‌ తదితరులు ఉన్నారు. 

Back to Top