ప్ర‌భుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం

శ్రీ‌కాకుళంః చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు పిరియా సాయిరాజ్‌, న‌ర్తు రామారావులు అన్నారు. సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కంచిలి మండ‌లం న‌వోద‌య‌కాల‌నీ గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు పేద ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా మ‌ధ్య‌లో టీడీపీ నేత‌లు అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. గ్రామాల్లో ఫించ‌న్లు, రేష‌న్‌కార్డులు లేక అనేక మంది బడుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి ప‌రిపాల‌న కొన‌సాగించాల‌ని సూచించారు. 


Back to Top