ప్రజలే బాబుకు తగిన బుద్ది చెబుతారు

విశాఖపట్నంః గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్ కరణం ధర్మశ్రీ నర్సయ్యపేటలో గడపగడపలో పర్యటించారు.  ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. 

Back to Top