బాబుకు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతారు

పి.గన్నవరం: రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామంలో మంగళవారం గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమం జరిగింది. కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావుతో పాటు 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో ప్ర‌తీ ఇంటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌ను వివ‌రించారు. ఎన్నిక‌ల ముందు తప్పుడు వాగ్దానాలిచ్చి ప్ర‌జ‌ల‌ను వంచించాడ‌ని చెప్పారు. 

Back to Top