వైయస్ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మంచి రోజులు

రాజ‌న్న రాజ్యం జ‌గ‌న‌న్న‌తోనే సాధ్యం
బొబ్బిలి:  రాష్ట్రంలో తిరిగి రాజ‌న్న రాజ్యం రావాలంటే జ‌గ‌న‌న్న‌తోనే సాధ్య‌మ‌ని వైయ‌స్సార్‌సీపీ బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ పోల అజ‌య్ అన్నారు. మండ‌ల ప‌రిధిలోని గ‌జ‌రాయునివ‌ల‌స‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్యక్ర‌మం ఆయ‌న అధ్య‌క్షత‌న కొన‌సాగింది. ప్ర‌జ‌ల బాధ‌ల‌న్నీ తీరాలంటే జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని కోరారు. చంద్ర‌బాబు పాల‌న  రావ‌ణుడి పాల‌న అని, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాల‌న రాముడి పాల‌న అని ఆయ‌న పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసేందుకు ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

మభ్యపెట్టే రోజులు పోయాయి
ప‌శ్చిమ విశాఖ‌:  చంద్రబాబూ ప్ర‌జ‌లు మీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే స‌మ‌య‌మొచ్చింది. ఎన్నిక‌ల హామీలు నెర‌వేర్చ‌కుండా మాయ‌మాట‌ల‌తో మ‌భ్య‌పెట్టే రోజులు పోయాయ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానిక 42వ వార్డులో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను వివ‌రిస్తూ మార్కులు వేయించారు. 

ప్ర‌జా కోర్టులో చంద్ర‌బాబు దోషి
గాజుల‌ప‌ల్లె(మ‌హానంది):  సాధ్యం కాని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసి అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌జాకోర్టులో దోషి అని వైయ‌స్సార్‌సీపీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానిక గాజుల‌ప‌ల్లెలోని ఎస్సీ కాల‌నీలో ప‌ర్య‌టించారు. బాబు వ‌స్తే జాబు అని, రుణ‌మాఫీ అని, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్పి ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేసిన చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తగిన బుద్ది చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. చంద్రబాబు ప్ర‌భుత్వం కేవ‌లం మాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింద‌ని, చేత‌ల్లో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ధ్వ‌జమెత్తారు. 

తాజా ఫోటోలు

Back to Top