బూటకపు హామీలతో ప్రజలను దారుణంగా వంచించాడు

కర్నూలు(ఎమ్మిగనూరు))చంద్రబాబు నాయుడు బూటకపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను దారుణంగా వంచించాడని వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పెద్దకొత్తిలి, సంజీవపురం తదితర గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రుణాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను మహిళలు, రైతులు, వృద్ధులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మహానేత వైయస్ఆర్ పాలనలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేవని, బాబు వచ్చాక లేనిపోని నిబంధనలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మోసకారి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  


Back to Top