సమస్యల వలయంలో ప్రజలు

శ్రీ‌కాకుళం: చ‌ంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో గ్రామాల‌న్నీ స‌మ‌స్య‌ల‌తో నిండిపోయాయ‌ని, ప్ర‌జ‌లంతా అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మెలియ‌పుట్టి మండ‌లం బాణాపురం పంచాయ‌తీ సుర్జిని, ద‌ళిత వాడ‌ల్లో రెడ్డి శాంతి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె గ్రామంలో ప‌ర్య‌టించి స్థానికుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌చురించిన ప్ర‌జా బ్యాలెట్‌ను వారికి అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.


Back to Top