బాబుకు ప్ర‌జ‌లే బుద్ధిచెబుతారు

ప్రకాశంః ఎన్నిక‌ల ముందు వంద‌ల కొద్ది వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిన చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బుద్ధిచెప్పే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వేట‌పాలెం మండ‌లం ద‌ళిత‌వాడ నందు నిర్వ‌హించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో య‌డం బాలాజీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం చంద్ర‌బాబు మోస‌పు వాగ్ధానాల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను స్థానికుల‌కు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top