బాబు పాలనలో ప్రజలకు తప్పని కష్టాలు

ప్ర‌కాశంః చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో రాష్ట్ర ప్ర‌జ‌లంతా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా కొండేపి నియోజ‌క‌వ‌ర్గ స‌మన్వ‌య‌క‌ర్త వ‌రికూటి అశోక్‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌న్మ‌భూమి క‌మిటీల వ‌ల్ల అర్హులైన ల‌బ్దిదారుల‌కు పెన్ష‌న్లు అంద‌డం లేద‌ని మండిప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొండేపి మండ‌లం మూగ‌చింత‌ల గ్రామంలో అశోక్‌బాబు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top