- హామీలకు తూట్లు పొడిచాడు
- అవినీతికి పెద్దపీట వేశాడు
- బాబు సర్కార్ పై ప్రజల మండిపాటు
వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఏ గడపతొక్కిన ఒకటే ఆవేదన. ప్రజలు తమ కష్టాలను వైయస్సార్సీపీ శ్రేణులకు చెప్పుకొని విలపిస్తున్నారు. బాబును నమ్మి ఓటేసినందుకు తమను నట్టేట ముంచాడని వాపోతున్నారు. అబద్ధపు హామీలతో తమను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ కు తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల ఇంఛార్జ్ రాజగోపాల్ రెడ్డి వెంకటేశ్వరపురం, ఉడుమలపురం గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గడగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాపిలి పట్టణంలో గడపగడపలో పర్యటించారు. కోడుమూరు నియోజకవర్గ ఇంఛార్జ్ మురళీ కృష్ట ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో గడపగడపకూ కార్యక్రమం కొనసాగింది. పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ నారాయణ రెడ్డి క్రిష్ణగిరి మండలం చిట్యాలలో ఇంటింటికీ వెళ్లి టీడీపీ మోసాలను ప్రజలకు వివరించారు.
.jpg)
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఇప్పగుంట్ల గ్రామంలో కొండేపి నియోజకవర్గ ఇంఛార్జ్ అశోక్ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పాలనలో దగాపడిన ప్రజలకు వైయస్సార్సీపీ అండగా నిలిచింది. అధైర్యపడొద్దని మేమున్నామంటూ నేతలు వారికి భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బాబు ప్రభుత్వంపై పోరాడుదామని పిలువునిచ్చారు. నెరవేర్చని పక్షంలో మన ప్రభుత్వం వస్తుందని...వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే మన కష్టాలన్నీ తీరిపోతాయని వారికి కొండంత ధైర్యానిస్తున్నారు.