చంద్రబాబు అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు

అన్నీ బ‌డాయి మాట‌లే
నందికొట్కూరు:  సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో బ‌డాయి మాట‌లు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని ఎమ్మెల్యే ఐజ‌య్య ఎద్దేవా చేశారు. మండ‌ల ప‌రిధిలోని వాడాల‌, మిట్ట‌కందాల గ్రామాల్లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఎమ్మెల్యే అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ప్ర‌భుత్వం పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని, రైతులు అప్పుల‌పాలై కుటుంబ పోష‌ణ భార‌మై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ఆరాచ‌క పాల‌న‌కు ప్ర‌జ‌లే బుద్ది చెప్పాల‌ని ఆయ‌న కోరారు. 

రోడ్డుమీదే మురుగునీరు
సూళ్లూరుపేట‌: ప‌ట్ట‌ణంలోని 17వ వార్డు ప‌రిధిలోని మ‌హదేవ‌య్య‌న‌గ‌ర్‌లో ప్ర‌ధాన వీధిలో మురుగునీటి కాలువ‌లు లేక రోడ్డు మీద‌కే మురుగునీరు వ‌దిలేయ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే కిటివేటి సంజీవ‌య్య ఎదుట స్థానికులు వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే స్థానికంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్రబాబు ఆరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌ల‌తో మార్కులు వేయించారు. రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ప‌న్నుపోటుతో ఇబ్బంది పెడితే ఊరుకోం
నెల్లూరు(మినీబైపాస్‌): అధిక ప‌న్నుపోటుతో ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోన‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి కార్పొరేష‌న్ అధికారుల‌ను హెచ్చ‌రించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న 18వ డివిజ‌న్ ప‌రిధిలోని కొండాయ‌పాళెంలో స్థానికంగా ప‌ర్య‌టించారు. న‌గ‌రంలో భూగ‌ర్భ డ్రైనేజీ వ్య‌వ‌స్త‌, మంచినీటి సౌక‌ర్యాల కోసం రూ. 1200కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టాల‌నే నిర్ణ‌యాన్ని తాము స్వాగ‌తిస్తున్నామ‌ని, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గ్రాంట్ రూపంలో ఇస్తే ప్ర‌జ‌ల‌పై ఎలాంటి భారం ప‌డ‌ద‌న్నారు. ఈ డ‌బ్బును హ‌డ్కో రుణం ద్వారా ఇస్తే ప్ర‌జ‌ల‌పై భారం ప‌డుతుంద‌ని, నెల్లూరు కార్పొరేష‌న్ వ‌డ్డీ క‌ట్టే ప‌రిస్థితుల్లో లేద‌న్నారు. 

తాజా ఫోటోలు

Back to Top