ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

తూర్పుగోదావరి))మండపేట నియోజకవర్గ కన్వీనర్ వేగుళ్ల పట్టాబి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో కపిలేశ్వపురంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ప్రజాబ్యాలెట్ ను అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకట్రావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. 

Back to Top