బాబు పాలనను "చీ"ధరించుకుంటున్న ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి బాబు మోసపూరిత పాలనను ఎండగడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బుర్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తుమ్మలగుంట గ్రామంలో గడగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. పింఛన్ రావడం లేదు.రేషన్ అందడం లేదు.  రుణాల మాఫీ గాక ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లు లేవు. ఉద్యోగాలు లేవని ప్రతీ గడప బాబు చేసిన మోసాలను వైయస్సార్సీపీ శ్రేణులకు చెప్పుకొని గగ్గోలు పెడుతోంది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని నేతలు ఈసందర్భంగా వారిలో ఓ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 

విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మున్సిపాలిటీ , పెదబొడ్డేపల్లి 12 వ వార్డ్  లో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త పెట్ల ఉమా శంకర్ గణేష్ గడపగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రజలకు కరపత్రాలు అందించి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top