బాబు మాయ‌మాట‌ల‌ు నమ్మి మోసపోయాం

శ్రీ‌కాకుళంః చంద్ర‌బాబు మాయ‌మాట‌లు న‌మ్మి మోస‌పోయిన రైతులు అప్పుల‌పాల‌వుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన కృష్ణ‌దాస్ అన్నారు. ఎన్నిక‌ల ముందు రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీలిచ్చి రైతుల‌ను, డ్వాక్రా సంఘాల‌ను మోసం చేశాడ‌ని మండిప‌డ్డారు. శ్రీ‌కాకుళం జిల్లా న‌ర్స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం పోలాకి మండ‌లం డోల గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో కృష్ణ‌దాస్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. టీడీపీ ఎన్నిక‌ల హామీల అమ‌లుపై ఆరా తీశారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేద‌ని మండిప‌డ్డారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు


Back to Top