గడపగడపలో వైయస్సార్సీపీకి ప్రజల ఆశీర్వాదం

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల మండలం లక్ష్మపురం గ్రామంలో గడపగడపలో పర్యటించారు. ఎమ్మిగనేరు నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ మోహన్ రెడ్డి గోనెగొండ పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజల వద్దకు వెళ్లారు. అదేవిధంగా కర్నూలు నియోజకవర్గ ఇంఛార్జ్ హఫీజ్ ఖాన్ రెండవ వార్డులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాబు మోసపూరిత పాలనను వివరించారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


వైయస్సీర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో  23వ రోజు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...వైయస్ జగన్ మీద ప్రజలు అపారమైన విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో బాబుకు ఓటేసి మోసపోయామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇళ్లు కట్టిస్తానన్నాడు. ఇలా ఏ ఒక్కటీ అమలు చేయని చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.  పేదల పక్షాన వైయస్ జగన్ ఉన్నారని, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్లీ రాజన్న పాలన తీసుకొస్తారని, అధైర్యపడొద్దని ప్రజలకు ఓ భరోసా కల్పిస్తున్నామన్నారు నాగార్జున. 


Back to Top