ప్రజలు మనస్ఫూర్తిగా టీడీపీని వ్యతిరేకిస్తున్నారు

తూర్పుగోదావరి))మండపేటలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం దిగ్విజయం కొనసాగుతోంది. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా  మండపేట కో ఆర్డినేటర్ పట్టాబి రామయ్యచౌదరి, జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కేట్ కట్ చేశారు. రాయవరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.... చంద్రబాబుతో విసిగి వేసారమని, మోసపోయామని, ఏం చేయాలో తెలియడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఇప్పుడు  బాబుకు తోడు మోడీ తయారయ్యాడని ప్రజలు తిట్టుకుంటున్నారని చెప్పారు. వాళ్లు చేస్తున్న తప్పిదాలు సామాన్య ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.  చేనేతలకు ఇస్తానన్న రాయితీలు, ఇతర హామీలు ఏవీ బాబు నెరవేర్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమస్యల పుట్టలా ఉందన్నారు. బాబు తన అసమర్థతను తెలుసుకోవాలంటే ఆయనగానీ, ఆయన మనుషులు గానీ మారువేషంలో ప్రజల్లో తిరిగితే తెలుస్తుందన్నారు. ప్రజలు మనస్ఫూర్తిగా టీడీపీని వ్యతిరేకిస్తున్నారని కన్నబాబు పేర్కొన్నారు. 

ఏం ఇంటికీ, ఏ వీధికి వెళ్లినా సమస్యలేనని వేగుళ్ల పట్టాభి రామయ్య అన్నారు. బాబు వచ్చాక డ్వా క్రా రుణాలు రద్దు చేయలేదు.   ఎక్కడ కూడా ఇంటిస్థలం గానీ, లోన్ గాను ఇచ్చింది లేదు. ఆడిపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ. 25వేలు అన్నాడు. ఏ ఒక్కరిని అడిగినా రాలేదని చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదని దుయ్యబట్టారు. సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. నగదు రద్దుతో కూలీకి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వైయస్సార్సీపీ విషప్రచారం చేస్తుందని టీడీపీ నేతలు  మాట్లాడడం కాదని ప్రజల వద్దకు వెళితే వారు పడుతున్న బాధ ఏంటో తెలుస్తుందని హితవు పలికారు. 
Back to Top