ప్రకాశం: చంద్రబాబు పాలనలో ప్రజలకు అన్నీ అవస్థలే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు అన్నారు. గూడ్లురు మండలం లోని చిన్నలాటిరీపి గ్రామంలో ఆయన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తూమాటి మాధవ రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మహానేత మరణాంతరం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలుగుదేశ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- కనిగిరి నియోజకవర్గంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాబ్యాలెట్ అందజేశారు.