ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు

అనంతపురంః అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పట్టణంలోని డివిజన్ లలో నిర్వహిస్తున్న గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. వైయస్సార్సీపీ నేతలకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఈ సందర్భంగా గుర్నాథరెడ్డి మాట్లాడుతూ...ఎక్కడికెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని అన్నారు.  పింఛన్లు అందడం లేదు. రేషన్ ఇవ్వడం లేదని మహిళలు వాపోతున్నారని పేర్కొన్నారు.  స్టోర్ ల దగ్గర మహిళలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా వేలిముద్రలు పడడం లేదని వెనక్కిపంపుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వానికి సూచించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు దుర్భర పరిస్థితులు  ఎదుర్కొంటున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ తీరును ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు.  వైయస్ఆర్ ఉన్నప్పుడే అన్ని సమస్యలు పరిష్కరించేవాడని ప్రజలంతా అంటున్నారని, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.   మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతీ ఒక్కరూ బాబు పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


Back to Top