అవినీతి పాల‌న‌పై ఆగ్ర‌హంగా ఉన్న ప్ర‌జ‌లు

శ్రీ‌కాకుళంః చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌లంతా ఆగ్ర‌హంగా ఉన్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన కృష్ణ‌దాస్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా సంక్షేమాన్ని ప‌ట్టించుకోకుండా రాజ‌ధాని పేరుతో ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేస్తుంద‌ని మండిప‌డ్డారు. శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గొట్టిప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని రెడ్డికిపేట‌, యాత‌పేట‌ల్లో గ‌డ‌ప గ‌డ‌పకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ చంద్ర‌బాబు దోపిడీ పాల‌న‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top