పచ్చపార్టీపై ప్రజా వ్యతిరేకత

విశాఖ జిల్లాః  అరకు సమన్వయకర్తలు అరుణకుమారి ,పోయా రాజారావు, సూర్య నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు ఆధ్వర్యంలో ముంచంగిపట్టు మండలం ఏనుగు రాయి పంచాయతిలోని చోటాముఖి పూట్ ,కొండపాడు గ్రామాలలో గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారు ముందుకు సాగుతున్నారు. ప్రతీ ఒక్కరి నోట ఒకటే మాట వినిపిస్తోంది. మోసకారి బాబును సాగనంపుతాం...ప్రజానాయకుడు వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటామని చెబుతున్నారు. 

నర్సీపట్నం నియోజకవర్గంలోని  గొలుగొండ మండలం , సాలిక మల్లవరం పంచాయతీ పరిధిలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గడపగడపలో పర్యటించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైయస్సార్సీపీ నేత దూలం నాగేశ్వరరావు  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతీ గడపలో బాబు మోసాలను ఎండగట్టారు. 

శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి బండి ఆత్మకూర్ మండలం, సింగవరం గ్రామంలో బుడ్డాశేషారెడ్డి విస్తృతంగా పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అధికారం కోసం అబద్ధపు హామీలతో మోసం చేసిన చంద్రబాబుపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 

Back to Top