టీడీపీ సర్కార్ పై ప్రజాగ్రహం

క‌ర్నూలుః బాబు ప‌రిపాల‌నపై ప్ర‌జ‌లంతా ఆగ్ర‌హంతో ఉన్నార‌ని, స‌రైన స‌మ‌యంలో త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం గోనెగండ్ల మండ‌లం, బైలుప్పాల గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ప్ర‌తి ఇంటికి తిరుగుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల అడిగి తెలుసుకున్నారు. బాబు మోస‌పూరిత హామీల‌పై వైయ‌స్ఆర్ సీపీ ముద్రించిన ప్ర‌జాబ్యాలెట్‌ను పంపిణీ చేశారు.


Back to Top