దగాకోరు ప్రభుత్వంపై ప్రజాగ్రహం

ఒంగోలు: నగరంలో ఆరవ రోజు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.   వైయస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు కేశవరాజుకుంట, చెన్న మల్లేశ్వరకాలనీలో గడపగడపలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలు నేతలకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు బొట్టుపెట్టి హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  బాబు మోసపూరిత పాలనను ప్రతి గడపలో ఎండగట్టారు. రెండేళ్లుగా బాబు చేస్తున్న వంచనను ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలు విస్మరించిన దగాకోరు ప్రభుత్వంపై  ప్రజలు మండిపడ్డారు. 
Back to Top