బాబుపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు

బాబు... మ‌మ్మ‌ల్ని మోసం చేశారు
పింఛ‌న్లు, గృహాలు, పొదుపు సంఘాల రుణ‌మాఫీపై హామీలిచ్చిన చంద్ర‌బాబు త‌మ‌ను మోసం చేశార‌ని వెల్దుర్తి ప‌ట్ట‌ణంలోని అన‌క‌ల‌వీధి, వ‌డ్డెగేరి, ముల్ల‌గేరి, బోయ‌వీధి, క్రిందిగేరి, పైగేరి, మాల‌గేరిలోని ప‌లువురు మ‌హిళ‌లు చంద్ర‌బాబుపై దుమ్మెత్తి పోశారు. గ‌డప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్రమంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ చెరుకుపాడు నారాయ‌ణ‌రెడ్డి ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టింంచారు. చంద్ర‌బాబు చేస్తున్న మోసాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని అబద్ధపు హామీలతో చంద్ర‌బాబు మీ వద్దకు వ‌స్తాడ‌ని వాటిని న‌మ్మి  మోస‌పోవ‌ద్ద‌ని ప్రజలకు సూచించారు. 

నిత్యావ‌స‌ర వ‌స్తువులు స‌క్ర‌మంగా పంపిణీ చేయండి
ప్ర‌భుత్వం పేద‌ల‌కు అంద‌జేస్తున్న నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను స‌క్ర‌మంగా పంపిణీ చేయాల‌ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. క‌ల్లూరు అర్బ‌న్ 31వ వార్డు పోలీసుకాల‌నీ, శ్రీ‌సాయిబాబా మందిరం ప్రాంతాల్లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని వార్డు ఇంచార్జీ మంచాల సుధాక‌ర‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కాల‌నీలోని 131వ నెంబ‌రు చౌక‌ధ‌ర‌ల దుకాణాన్ని ఎమ్మెల్యే త‌నిఖీ చేశారు. కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ ర‌ద్దుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని చ‌రితారెడ్డి పేర్కొన్నారు. ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ ఉద్యోగులు సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని కోరుతూ శ్రీకృష్ణ‌దేవ‌రాయ స‌ర్కిల్‌లో చేస్తున్న ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష‌కు ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి మ‌ద్ద‌తు తెలిపి, అనంత‌రం వారికి నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు. 

రానున్న‌ది రాజ‌న్న రాజ్యం
రానున్న‌ది రాజ‌న్న రాజ్య‌మ‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరుతాయని వైయ‌స్సార్‌సీపీ ఆదోని ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్ రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండ‌ల ప‌రిధిలోని చాగి గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌కు ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేశారు.  చంద్ర‌బాబు అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌ను వివ‌రించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, దీని ఫ‌లితం చంద్ర‌బాబు త‌ప్ప‌కుండా అనుభ‌విస్తార‌ని ఆయన ఎత్తిపొడిచారు. 

Back to Top