ప్ర‌జ‌లే బాబుకు బుద్ధి చెప్పాలి

శ్రీ‌కాకుళంః వంద‌ల‌కొద్ది హామీలు గుప్పించి అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాల‌ని శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిల‌క్ పిలుపునిచ్చారు. టెక్క‌లి మండ‌లం గంగాధ‌ర‌పేట గ్రామంలో తిల‌క్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తిల‌క్ మాట్లాడుతూ... చంద్ర‌బాబు రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాల‌రాస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్ర‌జారంజ‌క ప‌రిపాల‌న సాగాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకోవాల‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితే రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌న్నీ శాశ్వ‌తంగా ప‌రిష్కారం అవుతాయ‌న్నారు.Back to Top