పింఛన్లు, గృహరుణం ఏవీ ఇవ్వడం లేదు

తూర్పుగోదావరి)) రాజమహేంద్రవరం రురల్ మండల పరిధి బొమ్మూరు నందు స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వీర్రాజుకు తమ సమస్యలు విన్నవించారు. వర్షానికి మట్టి గోడలు నాని  పూరి పాక కూలిపోయిందని,  పంచాయతీలో తెలియజేసిన కనీసం స్పందన లేదని కప్పల సత్యవేని ఆవేదన వ్యక్తంచేశారు. గృహరుణం కోసం అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారుల నుండి ఇప్పటివరకు మంజూరు కాలేదని ఉప్పులూరి పాపా  అనే మహిళ వీర్రాజుకు వినవించుకుంది.  పింఛన్లు రావడం లేదని గెడ్డం నాగురమ్మ అనే వృద్ధురాలు, షేక్ షరీఫ్ అనే వికలాంగుడు తమ గోడును చెప్పుకున్నారు. 

ఏ గడపలో చూసిన సమస్యలేనని, ప్రభుత్వానికి ప్రజల గోడే పట్టడం లేదని వీర్రాజు మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో యానుమాల త్యాగరాజు , కేవీ సుబారెడ్డి , ముద్దలా అను ,తోడేటి రాజా , కాలెం బాబి, శ్రీపతి చంటి, అంబటి శ్రీను, రామారావు,బిధం రాజు,ఆ జి ర్ నాయుడు, సుశిలా, రాణి, తాటికొండ విష్ణు మూర్తి, సూర్యచంద్రం,భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. 
Back to Top