పింఛన్ కష్టాలు

శ్రీకాకుళం(టెక్కలి))టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి పింఛన్ దారులను ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. నందిగాం మండలం నౌగాం పంచాయతీ హుకుంపేటలో వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. 108 అంబులెన్స్ లు తమ గ్రామానికి రావడం లేదని ఏకరవు పెట్టారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలపై తిలక్ ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందించి మార్కులు వేయించారు. బాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.


తాజా ఫోటోలు

Back to Top