నిధుల కేటాయింపులో వివక్ష తగదు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ లోని బావిమిట్టపాళెంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్వాన్నంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థ, మురుగు నీరుతో తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఎదుట మొరపెట్టుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద దళిత వాడల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్లో బావిమిట్టపాళెంకి పాలకులు, అధికారులు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం పట్ల ఎమ్మెల్యే మండిపడ్డారు. స్థానికంగా వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చూడాలని నగర్ మేయర్ ని, కమీషనర్ ని కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు.


Back to Top