వైయస్ జగన్ కే మా ఓటు

అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా టీడీపీ మోస‌పూరిత హామీలు ఇచ్చింద‌ని... ప్ర‌స్తుతం వాటిని అమ‌లు చేయ‌కుండా మొహం చాటేస్తోందని ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌రెడ్డి మండిపడ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా పందికోన‌లో ఆయ‌న ప‌ర్య‌టించారు. మరోవైరు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. సంక్షేమ పథకాల్లో బాబు అన‌ర్హుల‌కు ప్రాధాన్యం ఇస్తూ అర్హుల‌కు మొండిచేయి చూపిస్తున్నార‌ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి ఆరోపించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆమె ప‌ట్ట‌ణంలోని 31వ వార్డు ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. 

వైయస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. గడపగడపకు వెళ్లి బాబు మోసాలను వివరిస్తున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసిన బాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెబుదామని హెచ్చరించారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తాడ‌ని న‌మ్మాం... చెప్పిన‌ట్లు ఒక్క రూపాయికే భోజ‌నం పెడ‌తాడ‌ని అనుకున్నాం. చివ‌రకు వేలిముద్ర‌లు ప‌డ‌టం లేదంటూ మూడు నెల‌లుగా బియ్యం ఇవ్వ‌డం ఆపేశారు. ఈ ప్ర‌భుత్వ పాల‌న‌పై నాకు న‌మ్మ‌కం పోయింది. ఆశ‌ల‌న్నీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపైనే పెట్టుకున్నాన‌ని ప‌న్నేప‌ల్లి గ్రామానికి చెందిన పెంట‌య్య వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య ఎదుట ఆవేద‌న వ్యక్తం చేసింది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పెళ్ల‌కూరు మండ‌లం పిన్నేప‌ల్లిలో ప‌ర్య‌టించారు. 

Back to Top