బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

ప్రకాశంః జిల్లాలోని కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం ధర్మావరంలో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. వరికూటి అశోక్ బాబుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి బాబు మోసాలను ఎండగడుతున్నారు. ఎన్నికల హామీలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఎక్కడికెళ్లినా బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కర్నూలుః  గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులు  ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఆళ్లగడ్డలో నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగారెడ్డి, ఎమ్మిగనేరులో నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి, పత్తికొండలో నియోజకవర్గ ఇంఛార్జ్ సి.హెచ్. నారాయణరెడ్డితో పాటు ఇతర నాయకులు ఇంటింటికి వెళ్లి బాబు మోసపూరిత పాలనను వివరిస్తున్నారు. ప్రతీ గడపకు వెళ్లి ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. వారికి కరపత్రాలను అందించి మార్కులు వేయమని కోరుతున్నారు. ఈసందర్భంగా ప్రతీ గడపలో ఒకే మాట వినిపిస్తోంది. మాయమాటలతో నమ్మించి  ఓట్లు వేయించుకొని మోసం చేసిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ప్రజలు  హెచ్చరిస్తున్నారు. తాజా వీడియోలు

Back to Top