పేదల పక్షాన ప్రతిపక్ష నేత చేస్తున్న పోరాటం గొప్పది

శ్రీకాకుళం(నరసన్నపేట)

)జలుమూరు మండలం గోటివాడ గ్రామ పంచాయతీలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు, అశేష గ్రామ ప్రజలు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జయప్రదం చేశారు. రుణాలు మాఫీ కాలేదని రైతులు, పింఛన్లు రావడం లేదని మహిళలు వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చడం లేదని ధర్మాన మండిపడ్డారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ఆశయ సాధన కోసం వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్  పేదల పక్షాన చేస్తున్న పోరాటం గొప్పదని ధర్మాన అన్నారు. ధర్మాన మాట్లాడుతున్నంత సేపు రైతులు వైయస్ఆర్ పాదయాత్రను గుర్తు చేసుకున్నారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top