ప్రజాసమస్యల పరిష్కారం వైయస్సార్సీపీతోనే సాధ్యం

ప్రజలను నట్టేట ముంచాడు
జ‌గ్గంపేట‌: ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జ‌గ్గంపేట కో-ఆర్డినేట‌ర్ ముత్యాల శ్రీ‌నివాస్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని రంప‌య‌ర్రంపాలెంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు కాని అనేక హామీలు గుప్పించి ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఒక్క వైయ‌స్సార్ సీపీతోనే సాధ్య‌మ‌ని, రానున్న కాలంలో ప్ర‌జ‌లంతా పార్టీకి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ఆయ‌న కోరారు.

బాబుకు బుద్ధి చెప్పండి
న‌ర‌స‌న్న‌పేట: బూట‌క‌పు హామీల‌తో చంద్రబాబు తమను మోసం చేశారని ప్ర‌జ‌లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని పార‌శెల్లి, రెల్లివ‌ల‌స గ్రామాల్లో ప‌ర్య‌టించి బాబు మోస‌పూరిత హామీల‌పై వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... హామీల‌ను తుంగ‌లోకి తొక్కిన టీడీపీ ప్ర‌భుత్వానికి త‌గిన బుద్ది చెప్పాలని, టీడీపీ నేతలను ఎక్కడిక్కడ నిల‌దీయాల‌ని  ప్రజలకు పిలుపునిచ్చారు. 

Back to Top