ప్రతీ నోట ఒకే మాట

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయస్సార్సీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ఎండగడుతున్నారు. గడపగడపలో బాబు అవినీతి, అక్రమాలను వివరిస్తున్నారు. ధర్మాన క్రిష్ణదాస్, రెడ్డి శాంతి తదితర నేతలు ప్రతీ గడపలో పర్యటిస్తున్నారు.  ఈసందర్భంగా ప్రతీ నోట ఒకే మాట వినిపిస్తోంది. అబద్ధపు హామీలతో మోసం చేసిన చంద్రబాబును గద్దెదింపడమే తమ ధ్యేయమని చెబుతున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు , వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయని కోరుకుంటున్నారు. 


Back to Top