పైసా కూడా మాఫీ కాలేదు

ఉరవకొండ: చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.. రెండున్నరేళ్లు గడిచినా మాకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఆయన మాటలు నమ్మి మోసపోయామని పట్టణంలోని 11వ వార్డు కొండప్ప బావి వద్ద పలువురు చేనేత కుటుంబాలు ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.  స్థానిక నాయకులు ఉప సర్పంచ్‌ జిలకర మోహన్, పటటణ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎంసీ నాగభూషణం, మిడతల చంద్రమౌలి, ఎంపీటీసీ ఎంసీ సత్యవతి వార్డు సభ్యులు ఈడిగ ప్రసాద్, సోమా శేఖర్‌లు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ప్రజా బ్యాలెట్‌ పంపిణీ చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.


Back to Top