ఒక్క హామీ నెరవేర్చడం లేదు

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల‌కు అన్యాయం
నంద్యాల‌(జూలేప‌ల్లె):  ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. మండ‌ల ప‌రిధిలోని జూలేప‌ల్లె గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదాపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తూ బాబు ప్ర‌త్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నార‌ని విమ‌ర్శించారు.  

సంక్షేమాన్ని విస్మ‌రించిన బాబు
ఆళ్ల‌గ‌డ్డ‌: చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌ర్చిన హామీల్లో ఏ ఒక్క‌టి అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను వంచించి సంక్షేమాన్ని విస్మ‌రించార‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ డాక్ట‌ర్ రామ‌లింగారెడ్డి విమ‌ర్శించారు. ప‌ట్ట‌ణంలోని 15వ వార్డులో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... రైతుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం బేష‌ర‌తుగా రుణ‌మాఫీ చేసిన ఘ‌న‌త వైయ‌స్సార్‌కే ద‌క్కుతుంద‌న్నారు. రాబోయే కాలంలో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిస్తేనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌న్నారు. 

Back to Top